Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూర్చొన్న చెట్టు కొమ్మను నరుకుతున్న డీఎల్: నేతలు

Webdunia
రాష్ట్ర ఆరోగ్య మంత్రి డీఎల్.రవీంధ్రా రెడ్డి చేస్తున్న సవాళ్లు, ప్రతి సవాళ్ళపై కిరణ్ కుమార్ మంత్రివర్గానికి చెందిన ఇతర సహచరులు తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లకు విసురుకోవడం ఆయనకు మంచిది కాదన్నారు.

ముఖ్యంగా, మంత్రి డీఎల్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే కూర్చొన్న చెట్టు కొమ్మనే నరుతున్న చందంగా ఉందని వారు వాపోతున్నారు. అసలే ఆగ్రహంతో రగిలిపోతున్న యువనేత జగన్‌ వర్గాన్ని మరింత రెచ్చగొట్టేలా మంత్రి డీఎల్ వ్యాఖ్యలు చేయడాన్ని వారు తప్పుబడుతున్నారు.

ఇది కేవలం మంత్రికి మాత్రమే కాకుండా ఇటూ ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌ రెడ్డికి, అటూ పార్టీ నేతలకు ఎంత మాత్రం నచ్చడం లేదని పలువురు అంతర్గతంగా అంటున్నారు. అనవసరంగా ఉద్రేకాలకు పోయి ఓడిపోతే రేపటి రోజు పార్టీ పరువు ఏమవుతుంది? పైగా ప్రభుత్వంలో, ఒక మంత్రిగా బాధ్యత గల హోదాలో ఉన్న డీఎల్‌ ఆ విధంగా రాజీనామాలకు సవాళ్ళు విసరడం భావ్యంకాదంటున్నారు.

ఇలా చేయడం ద్వారా తను కూర్చున్న చెట్టు కొమ్మనే నరికేసుకున్నట్లు, ప్రభుత్వం కూలిపోయే పరిస్థితిని సృష్టించుకున్న వాళ్ళమవుతామని డీఎల్‌ తీరుపై పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, మంత్రి డీఎల్ వ్యవహారశైలి చూస్తుంటే వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

Show comments