Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రాన్ని విభజించడం అంత సులభం కాదు: ఎంపీ కావూరి

Webdunia
బుధవారం, 5 జనవరి 2011 (15:33 IST)
రాష్ట్రాన్ని విభజించడం అంత సులభమైన విషయం కాదని తాను భావిస్తున్నట్టు ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. ఆయన బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేయడం అంత తేలికైన పని కాదని తాను భావిస్తున్నట్టు చెప్పారు.

హోం మంత్రి చిదంబరం ఏర్పాటు చేయనున్న అఖిలపక్ష సమావేశంలో చర్చించాల్సిన అంశాలపైనే తాము ప్రణబ్‌తో చర్చించినట్టు తెలిపారు. ఒక కాంగ్రెస్ పార్టీ సభ్యునిగానే ఆయనతో భేటీ అయ్యామన్నారు. ఈనెల ఆరో తేదీన ప్రస్తావించాల్సిన అంశాలపైనే చర్చిస్తామన్నారు.

అలాగే, నివేదిక ప్రతులను అందజేసిన తర్వాత తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు కొంత సమయం ఇవ్వాలని తాము కోరినట్టు చెప్పారు. దీనికి ప్రణబ్ కూడా ఏకీభవించారన్నారు. నివేదిక అందుకున్న తర్వాత పూర్తిగా అధ్యయనం చేసి అభిప్రాయం వెల్లడించాలని కోరారినట్టు ఆయన తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

Show comments