Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ కొత్త పార్టీ వల్ల కాంగ్రెస్‌కు తీవ్ర నష్టమే: గాదె వెంకట రెడ్డి

Webdunia
మంగళవారం, 4 జనవరి 2011 (11:54 IST)
కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయనున్న కొత్త రాజకీయ పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగనుందని మాజీ మంత్రి, బాపట్ల ఎమ్మెల్యే గాదె వెంకట రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన పర్చూరులో మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి తుది శ్వాస విడిచిన పావురాలగుట్ట సాక్షిగా జగన్ ఇచ్చిన మాట కోసమే ఓదార్పు యాత్రను సాగిస్తున్నారన్నారు. పావురాలగుట్ట వద్ద జరిగిన సభలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జగన్ ఓదార్పుయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఇందులో ఎలాంటి తప్పులేదన్నారు.

ఇకపోతే.. పార్టీతో తెగతెంపులు చేసుకున్న జగన్‌పై సొంత పార్టీ నేతలు విమర్శలు చేయడం భావ్యం కాదని గాదె హితవు పలికారు. వర్షాలకు దెబ్బతిన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కంటే ఇప్పుడు మంచి ప్యాకేజీ ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను పెంచి పెద్ద చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఆ విషయాన్ని ఆయన మరిచి పోవచ్చు గానీ, తాము మరచిపోలేదన్నారు.

ఇకపోతే.. యువనేత జగన్ పార్టీ పెడితే కాంగ్రెస్‌కు నష్టమేనన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెలువడక ముందే ప్రత్యేక తెలంగాణపై నేతలు వివిధ రకాలుగా ఊహాగానాలు చేయడం భావ్యం కాదన్నారు. ఈ నెల 6వ తేదీన నివేదిక బహిర్గతం కానుందని ఆ తర్వాత దీనిపై స్పందిస్తామని చెప్పారు. తన వరకు పక్కా సమైక్యవాదినని, వైఎస్ జీవించి ఉండివుంటే రాష్ట్రం లేదా పార్టీ ఈ దుస్థితిలో ఉండేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments