Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల దీక్షా డ్రామాపై అధిష్టానం సీరియస్!!

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2010 (13:40 IST)
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల వైఖరిపై ఆ పార్టీ అధినాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు న్యూఢిల్లీ వర్గాల సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ తుది నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో ఈ ఎంపీల లొల్లి ఏమిటని అధిష్టానం పెద్దలు మండిపడినట్టు వినికిడి. ఇదే అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ అధినేత్రి రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీసినట్టు తెలుస్తోంది.

సొంత పార్టీకి చెందిన నేతలే ఈ తరహాలో వీధిన పడటంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం శాంతియుత వాతావరణాన్ని కల్పించాల్సిన గౌరవ పార్లమెంట్ సభ్యులే ఈ విధంగా దీక్షకు దిగడాన్ని పటేల్ జీర్ణించుకోలేక పోయినట్టు సమాచారం. తాను పార్లమెంటు సభ్యులతో మాట్లాడి నచ్చజెప్పడానికి ప్రయత్నించానని, అయినా ఎంపీలెవ్వరూ మాట వినడం లేదని అహ్మద్ పటేల్‌కు సీఎం స్పష్టం చేశారు.

కాగా, విద్యార్థులపై పెట్టిన కేసులను 26వ తేదీ లోగా ఎత్తేయాలని తాము అల్టిమేటం ఇచ్చామని, అయినా ముఖ్యమంత్రి స్పందించలేదని ఎంపీలు వాదిస్తున్నారు. అందుకే విధిలేని పరిస్థితుల్లో దీక్ష చేస్తున్నామని ఎంపీలు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

Show comments