Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం క్యాన్వాయ్‌ను అడ్డుకున్న జగన్ వర్గీయులు: లాఠీచార్జ్

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2010 (18:33 IST)
ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత జిల్లా తొలి పర్యటనలో అడ్డంకులు ఎదురయ్యాయి. సీఎం కాన్వాయ్‌ను వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. ఈ లాఠీఛార్జ్‌లో తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తీవ్రగాలయ్యాయి.

రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన విషయం తెల్సిందే. హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. అక్కడ నుంచి కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. అయితే, తిరుపతిలో జగన్ వర్గీయులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు సీఎం కాన్వాయ్ ప్రయాణించే రహదారుల్లో రోడ్డుకు అడ్డంగా నల్లజెండాలతో బైఠాయించారు.

పోలీసులు ఎంత సర్దిచెప్పినా వారు పట్టించుకోలేదు. దీంతో కొద్దిసేపు పోలీసులకు, జగన్ వర్గీయులకు తోపులాట జరిగింది. అదేసమయంలో సీఎం కాన్వాయ్ వస్తుందని తెలియడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీలకు పని చెప్పారు. ఈ దాడిలో చెవిరెడ్డి కూడా గాయపడ్డారు. తన సొంత జిల్లా చిత్తూరులో సీఎంకు ఈ తరహా అడ్డంకులు ఎదురుకావడం గమనార్హం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్.ఆర్.ఆర్. సంగీత శక్తిని మరోసారి లండన్‌లో ప్రదర్శించనున్న కీరవాణి

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

మట్కా ట్రైలర్ పై చిరంజీవి స్పందన - మట్కాలో నేనే హీరో, విలన్ కూడా : వరుణ్ తేజ్

పుష్ప-2 ఐటం గర్ల్‌గా శ్రీలీల..!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

Show comments