Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా బంద్: నిమ్స్‌లో చంద్రబాబు దీక్ష!!

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2010 (09:27 IST)
రైతు సమస్యలపై గత మూడు రోజుల క్రితం నిరవధిక నిరాహారదీక్షను చేపట్టిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు దీక్షను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో సోమవారం తెల్లవారు జామున రంగ ప్రవేశం చేసిన హైదరాబాద్ పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత నిమ్స్ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. దీక్షకు చేపట్టినందుకు చంద్రబాబుతో పాటు ఆయనకు సంఘీభావం ప్రకటించిన ఆయన కుమారుడు లోకేష్‌పై నాన్‌బెయిల్ కేసులు నమోదు చేశారు.

ఇదిలావుండగా, చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యకర్తలు నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలకు దిగారు. బాబు ఉన్న నిమ్స్ ఆస్పత్రి వద్ద పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా, బాబు అరెస్టును ఖండిస్తూ ఆ పార్టీ సోమవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది.

పలు జిల్లాల్లో పార్టీ కార్యకర్తలు దుకాణాలు, విద్యాసంస్థలను బలవంతంగా మూసి వేయించారు. ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ అడ్డుకుని నిలుపుదల చేశారు. పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. జాతీయ రహదారులను దిగ్బంధం చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

29 మిలియన్ వ్యూస్ తో నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

Sumanth Prabhas: సుమంత్ ప్రభాస్, జగపతి బాబు మూవీ సెకండ్ షెడ్యూల్ పూర్తి

కల్చర్ ని చూపించే సినిమా బాపు : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

Show comments