Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిడిపికి జితేందర్ గుడ్‌బై.. టిఆర్ఎస్‌ తాయిలానికి సిద్ధం..!?

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2010 (12:34 IST)
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో గట్టి పట్టున్నటీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

బాబు వైఖరికి నిరసనగా జితేందర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో తెలంగాణాలో టిడిపికి భారీ గండేపడే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా.. జితేందర్ తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ తాయిలం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్లు సన్నిహత వర్గాలు అంటున్నాయి.

జితేందర్ చేరికతో టిఆర్ఎస్ మరింత బలపడుతుందని పలువురు నేతలు భావిస్తున్నారు. జితేందర్ రెడ్డి బాటలో గద్వాల్ మాజీ ఎమ్మేల్యే గట్టు భీముడు కూడా టిఆర్‌ఎస్ చేరే అవకాశం ఉంది. ఇప్పటికే జితేందర్ టిఆర్ఎస్ నేత హరీష్‌రావుతో రహస్యమంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.

ఇదే గనుక జరిగితే జితేందర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు కూడా టిఆర్ఎస్‌లో చేరవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 21 లేదా 22 తేదీలలో జితేందర్ రెడ్డి టిఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

బాలకృష్ణ డాకు మహారాజ్ అసలు నిరాశ పరచదు : సూర్యదేవర నాగవంశీ

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

#AjithKumar తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కోలీవుడ్ హీరో అజిత్ (Video)

డ్రింకర్ సాయి తో ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు - హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

Show comments