Webdunia - Bharat's app for daily news and videos

Install App

దున్నపోతుకు సున్నం వేస్తే ఎద్దు అవుతుందా: కేటీఆర్

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2010 (12:45 IST)
దున్నపోతుకు సున్నం వేస్తే ఎద్దు అవుతుందా అని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు, తెరాస అధినేత కేసీఆర్ తనయుడు కె.తారక రామారావు (కేటీఆర్) ప్రశ్నించారు. అలాగే, హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ప్రతివాడూ తెలంగాణ బిడ్డ అవుతారా అని ఆయన అన్నాడు.

విద్యార్థులపై కేసుల ఎత్తివేతపై సోమవారం ప్రభుత్వం అసెంబ్లీలో ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటనపై తెరాస భగ్గుమంది. ఉద్యమాల సమయంలో విద్యార్థులపై నమోదు చేసిన కేసులను రెండు కేటగిరీలుగా విభజించి, సాధారణ కేసులను మాత్రమే ఎత్తివేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

ముఖ్యంగా, తాను హైదరాబాద్ బిడ్డననీ, ముమ్మాటికీ తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడినేనని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. దున్నపోతుకు సున్నం వేస్తే ఎద్దు అవుతుందా.. అలాగే, హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ప్రతివాడూ తెలంగాణ బిడ్డ అవుతాడా అంటూ ప్రశ్నించారు.

కేసుల ఎత్తివేతలో ప్రభుత్వం నిర్లక్ష్యపూరిత ధోరణిని అవలంభిస్తోందన్నారు. ముఖ్యంగా, ప్రభుత్వానికి ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ట్రాప్‌లో పడి విద్యార్థులపై కేసుల ఎత్తివేతను ఆయన అడ్డుకుంటున్నారన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.

డిసెంబరు 31వ తేదీ తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేసేందుకు ప్రభుత్వంతో పాటు.. ముఖ్యమంత్రి కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఇదే జరిగితే ప్రజాయుద్ధం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామలక్ష్మణులు కల్పిత పాత్రలు - బహిరంగ క్షమాపణలు చెప్పిన శ్రీముఖి (Video)

'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ సర్కారు అనుమతి నిరాకరణ!!

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

Show comments