Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులపై పెట్టిన సాధారణ కేసులు ఎత్తివేత: హోం మంత్రి

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2010 (12:32 IST)
తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులపై నమోదు చేసిన కేసుల్లో అతి సాధారణ కేసులను మాత్రమే ఎత్తివేయనున్నట్టు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ కేసులను రెండుగా విభజించి అత్యంత కఠినమైన కేసులను ఎత్తివేయడం లేదని ఆమె తెలిపారు.

సోమవారం కేసుల ఎత్తివేతపై ప్రభుత్వం తరపున ఆమె ఒక ప్రకటన చేశారు. గత యేడాది కాలంలో మొత్తం 8047 మందిపై 1667 కేసులు నమోదైనట్టు చెప్పారు. వీటిలో 2436 మందిపై పెట్టిన 562 కేసులను ప్రభుత్వం ఎత్తివేసినట్లు తెలిపారు. నేరాల స్వభావాన్ని బట్టి కేసులను రెండు విభాగాలుగా విభజించామన్నారు. సాధారణ కేసులు ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయించినట్లు హోంమంత్రి ప్రకటన చేశారు.

రెండో విభాగంలో తీవ్రమైన కేసులు ఉన్నాయన్నారు. 2500 మందిపై 383 కేసులు న్యాయస్థానంలో విచారణలో ఉన్నాయన్నారు. 411 మందిపై 112 కేసులను దర్యాప్తు సమయంలోనే ఉపసంహరించటం జరిగిందన్నారు. తీవ్రతను బట్టే కేసులు ఉపసంహరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సబితా తెలిపారు.

జాతీయ నాయకుల విగ్రహాలు, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, ప్రభుత్వ అధికారులపై దాడులు వంటి మరింత తీవ్రత గల కేసులను ఎత్తివేసే విషయంపై పరిశీలన చేస్తున్నామన్నారు. అతి తీవ్రత గల ఇతర కేసులపై కేసులవారీగా దర్యాప్తు చేస్తామన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామలక్ష్మణులు కల్పిత పాత్రలు - బహిరంగ క్షమాపణలు చెప్పిన శ్రీముఖి (Video)

'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ సర్కారు అనుమతి నిరాకరణ!!

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

Show comments