Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి ఓదార్పులో వైఎస్.జగన్‌కు నిజమైన అగ్నిపరీక్ష!!

Webdunia
కడప మాజీ పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి వచ్చే యేడాది జనవరి నెలలో చేపట్టనున్న ఓదార్పు యాత్రతో నిజమైన అగ్నిపరీక్ష ఎదురుకానుంది. జనవరి రెండో తేదీ నుంచి ఆయన ఉత్తర కోస్తా జిల్లాల్లో తన ఓదార్పు యాత్రను చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాత్రలోనే జగన్ భవితవ్యం తేలిపోతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటి వరకు చేపట్టిన ఓదార్పు యాత్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీ హోదాలో చేపట్టారు. దీనికి అధిష్టానం వద్దంటున్నా.. జగన్ గట్టి పట్టుదలతో ముందుకు సాగారు. ప్రస్తుతం ఆయన తన ఎంపీ పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో జనవరిలో చేపట్టే ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ శ్రేణుల నుంచి ఎలాంటి సహాయక సహకారాలు అందుతాయో ఆసక్తికరంగా మారింది.

మరోవైపు ఈ యాత్రకు పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ నేతలను దూరంగా ఉంచాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటి నుంచే భారీ కసరత్తు చేస్తున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే ఆయా జిల్లాల నేతలకు ఆదేశాలను కూడా జారీ చేశారు. జగన్ ఓదార్పు యాత్రకు దూరంగా ఉండటమే కాకుండా ఎలాంటి సహాయం చేయరాదని, ముఖ్యంగా, కిందిస్థాయి కార్యకర్తలను సైతం దూరంగా ఉంచాలని కేకేఆర్ ఆదేశించినట్టు సమాచారం.

ఇదిలావుండగా, కోస్తా జిల్లాలకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జగన్ వర్గానికి మద్దతు ప్రకటించారు. ఇది జగన్ వర్గీయులను మరింత ఉత్సాహ పరిచేలా ఉంది. కొణతాలతో పాటు.. మరికొంతమంది నేతలు కూడా మన్ముందు జగన్‌కు మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిబాణధారి బార్బరిక్ స్ట్రైకింగ్ మోషన్ పోస్టర్

శివారెడ్డిని ఇండస్ట్రీలో తొక్కేసింది సీనియర్ కమేడియనా? మేనేజరా?

కంటెంట్ ఉంటే సినిమాకి జనాలొస్తారు: రాకేష్ వర్రే

ప్రతిభగల వారికోసం ప్రభాస్ ప్రారంభించిన ది స్క్రిప్ట్ క్రాఫ్ట్' వెబ్ సైట్

ట్రెండ్ కు భిన్నంగానే ధూం ధాం చేశా : చేతన్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

Show comments