Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: జీవన్ రెడ్డి

Webdunia
మరో మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతుందని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈ మూడు నెలల కాలం కోసం మంత్రిత్వశాఖల కోసం తెలంగాణ మంత్రులు పోటీపడరాదని హితవు పలికారు. అదేసమయంలో డిప్యూటీ సీఎం పదవిని తక్షణం తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

గత కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన గురువారం ఆకస్మికంగా మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కొత్త సీఎం వచ్చిన వెంటనే మాట తప్పారన్నారు. ముందుగా ప్రకటించినట్టుగా డిప్యూటీ సీఎం తెలంగాణ దళితునికి ఇవ్వలేదని మండిపడ్డారు.

ఏది ఏమైనా.. మరో మూడు నెలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతుందని, ఆ తర్వాత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు.. అన్ని మంత్రిత్వ శాఖలను తెలంగాణ మంత్రులే చేపడుతారన్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు శాఖల కోసం కయ్యానికి దిగడం మంచిది కాదన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments