Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం: మాజీ మంత్రి పెద్దిరెడ్డి

Webdunia
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే కూలిపోవడం ఖాయమని అటవీశాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు. వచ్చే యేడాది మార్చి 31వ తేదీ తర్వాత కొత్త ముఖ్యమంత్రి వస్తారని ఆయన చెప్పుకొచ్చారు.

కిరణ్ మంత్రివర్గంలో చోటు దక్కని పెద్దిరెడ్డి... గురువారం ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావన్నారు. అదేసమయంలో ఈ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. వచ్చే మార్చి 31వ తేదీ తర్వాత కొత్త ముఖ్యమంత్రి వస్తారన్నారు.

ఇకపోతే.. మంత్రిపదవి దక్కనందుకు పార్టీని వీడి ప్రసక్తే లేదన్నారు. సొంత పార్టీలోనే ఉంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై పోరాటం చేస్తామన్నారు. కిరణ్ నాయకత్వంలో తమ మద్దతుదారులకు, అనుచరులకు ఎలాంటి న్యాయం జరగదన్నారు.

పైపెచ్చు.. కిరణ్ కుమార్ రెడ్డితో ఆది నుంచి తమకు పడదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే తాను మంత్రిపదవి వద్దన్నారు. ఎందుకంటే ఆయనకు వెళ్లి ప్రిత రోజూ సెల్యూట్ చేయడానికి తన మనస్సు అంగీకరించదన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

Show comments