రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంపై అప్పుడే అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. గ్రూపులు గ్రూపులుగా ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఇందులో ఏడుగురు రంగారెడ్డి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని తెలిసింది.
తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై కర్నూలు ఎమ్మెల్యే కాటసాని రామ్‌గోపాల్ రెడ్డి సీరియస్ అయ్యారు. మంత్రివర్గంలో తన పేరు ఎందుకు లేదో చెప్పాలని కాటసాని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాకుండా ముఖ్యమంత్రితో భేటీకి అనంతరం తన భవిష్యత్ కార్యచరణపై ప్రకటన చేస్తానని కాటసాని వెల్లడించారు.
మరోవైపు రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త మంత్రివర్గం బుధవారం కొలువుదీరింది. కిరణ్ మంత్రివర్గంలో మొత్తం 39 మందికి చోటు దక్కింది. వైఎస్ఆర్ మంత్రివర్గంలో ఉన్న మంత్రుల్లో ఆరుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. మంత్రి పదవులు దక్కనివారిలో గాదె వెంకటరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు.