పారామెడికల్ సిబ్బందితో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దానం నాగేందర్ రెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పారా మెడికల్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసే జీవోను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ పారామెడికల్ సిబ్బంది గురువారం ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.
గురువారం మధ్యాహ్నం 12 గంటలలోపే తమ సమస్యలను పరిష్కరించాలని లేకుండా సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని పారామెడికల్ సిబ్బంది డెడ్‌లైన్ విధించారు.
రెగ్యులరైజేషన్‌తో పాటు 8 నెలల పాటు పెండింగ్ ఉన్న జీతాలను ఇవ్వాలని మెడికల్ సిబ్బంది కోరారు. దీంతో దిగి వచ్చిన మంత్రి దానం నాగేందర్ రెడ్డి వారంలోగా పారామెడికల్ ఉద్యోగాల క్రమ బద్ధీకరణకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి హామీ ఇవ్వడంతో పారామెడికల్ సిబ్బింది ఆందోళనను విరమించారు.