Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోరుబావిలో పడిన మహేష్‌ను వీడని మృత్యువు

Webdunia
సోమవారం, 18 జనవరి 2010 (18:02 IST)
బోరు బావిలో పడిన మహేష్ మృతి చెందాడు. ఏడేళ్ళ బాలుడిని సజీవంగా రక్షించేందుకు వరంగల్ జిల్లా అధికార యంత్రాంగంతో పాటు.. ప్రైవేటు సంస్థలు రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. బోరుబావిలో పడేటపుడే తలకిందులు పడటం వల్ల బాలుడు మృతి చెందినట్టు వైద్యులు చెపుతున్నారు.

వరంగల్ జిల్లా తొర్రూరు మండలం పోలెపల్లి శివారు చంద్రుతాండాకు చెందిన ధరావత్ మహేష్ ప్రమాదవశాత్తు 35 అడుగుల బోరు బావిలో పడిన విషయం తెల్సిందే. ఆ బాలుడి ప్రాణాలు కాపాడేందుకు జిల్లా యంత్రాంగం గత 24 గంటల పాటు శ్రమించినా మహేష్‌ను రక్షించలేక పోయింది.

అప్పులు చేసి తవ్వించిన బోరుబావే తమ ఆశాజ్యోతి ప్రాణాలు తీయడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మహేష్ మరణ వార్త తెలియడంతో చంద్రుతాండాలో విషాద ఛాయలు అలముకున్నాయి. అలాగే, ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్, ఎస్పీలు కూడా కళ్లు చెమర్చారు.

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments