Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర ఏర్పాటుకు ఇంటి దొంగల మోకాలడ్డు: యాష్కీ

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2010 (15:26 IST)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ వాదులే అడ్డుతగులుతున్నారని నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు మధు యాష్కీ ఆరోపించారు. ఆయన శుక్రవారం నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటుకు ఇంటి దొంగలే ప్రధాన అడ్డంకిగా ఉన్నారన్నారు.

తాము రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యేంత వరకు తాము విశ్రమించబోమన్నారు. అయితే, తమ లక్ష్య సాధనలో కొందరు తెలంగాణ వాదులే అడ్డు తగులుగుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి వారికి అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు.

ఇకపోతే.. తెలంగాణ ఉద్యమంలో మావోయిస్టులు చేరినట్టు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇందులో మావోలు ఉన్నదీ లేనిదీ పోలీసులే తేల్చాలని చెప్పారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ అవుతుందని డీజీపీ గిరీష్ కుమార్ వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇవి రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేవిగా ఉన్నట్టు తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments