Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ ప్రజల మనిషి: క్షేమంగా తిరిగొస్తారు: చిరు

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2009 (18:44 IST)
ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రజల మనిషి అని ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగదని, ఆయన ఖచ్చితంగా తిరిగి ప్రజాసేవకు పునరంకితం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

మూడు జిల్లాల పర్యటనకు బుధవారం ఉదయం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్.. కొద్దిసేపటికే ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ మాయమైన విషయం తెల్సిందే. దీనిపై అటు రాష్ట్రంతో పాటు.. ఇటు దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా, హెలికాఫ్టర్ ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు.

ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ మిస్సింగ్ వ్యవహారంపై ప్రరాపా అధినేత చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ ప్రజాబలం ఉన్న నేత. ఆయనకు దైవభక్తి కూడా ఎక్కువగా ఉంది. అందువల్ల ఆయన క్షేమంగా సురక్షితంగా చేరుకుంటారని చిరు విశ్వాసం వ్యక్తం చేశారు.

నల్లమల అటవీ ప్రాంతం దట్టంగా ఉంటుందని, కొండలు ఉంటాయని అందువల్ల ఆయన బయటకు రావడంలో ఆలస్యం జరిగి ఉంటుందని ఆయన చెప్పారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.

అడువుల్లో చిక్కుకుపోయిన ముఖ్యమంత్రికి సాయం చేయడానికి తన అభిమానులు సైతం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆయన కోసం స్థానిక ప్రజలతో కలిసి తన అభిమానులు, ప్రరాపా కార్యకర్తలు గాలింపు చర్యలు చేపట్టాలని చిరంజీవి ఆదేశించారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments