ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ రెండోది. అత్యధిక జనాభా కలిగిన రెండో దేశం. ప్రపంచంలో అగ్రదేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్‌లతో పోటీ పడుతూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న దేశం.. మన హిందుస్థాన్.
21 వ శతాబ్దిలోకి సగర్వంగా కాలిడిన మనం.. ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన ప్రసార, సమాచార శాఖను సొంతం చేసుకున్నాం. అయితే, దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తూ.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తూ.. చుక్కాని లేని రాష్ట్ర కాంగ్రెస్‌కు దిక్సూచిగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు.
అలాంటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రయాణిస్తూ వచ్చిన హెలికాఫ్టర్ మాయమై కొన్ని గంటలైనా ఇంతవరకు ఆచూకీ తెలియలేదు. ముఖ్యంగా.. వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఎక్కడ ల్యాండ్ అయిందో కూడా తెలుసుకోలేక పోవడం అత్యంత విషాదకరంగా చెప్పుకోవచ్చు.
కొత్త పుంతలు తొక్కుతున్న శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ.. సీఎం ఆచూకీని తెలుసుకోలేక పోవడం మన సమాచార వ్యవస్థ ఏ మేరకు అభివృద్ధి చెందిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్సార్ సంఘటనే అభివృద్ధి చెందిందని గొప్పలు చెప్పుకుంటున్న సమాచార వ్యవస్థ ఏ మేరకు వెనుకుబడి ఉందే స్పష్టం చేస్తోంది.