Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యక్ష ప్రసారాలను సమర్థించిన సోమనాథ్

Webdunia
చట్ట సభల సమావేశాల సందర్భంగా జరిగే కార్యకలాపాలను ప్రజలు వీక్షించే విధంగా ప్రత్యక్ష ప్రసారాలు ఉండాలని లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే ప్రప్రథమంగా పార్లమెంట్‌కు ప్రత్యేక ఛానల్‌ను ప్రారంభింపచేసి లోక్‌సభ గ్యాలరీని ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లిన ఘనత కూడా ఆయదే.

శనివారం ఆయన ఒక రోజు పాటు రాష్ట్రంలో పర్యటించిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చట్ట సభల కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలపై పునరాలోచన చేయడంలో ఔచిత్యం లేదన్నారు. ఏ కొందరు సభ్యులో అదుపు తప్పి వ్యవహరించినంత మాత్రాన మొత్తంగా చట్ట సభ ప్రసారాలను ప్రజలు నేరుగా చూడకుండా నిరోధించడం సరైన చర్య కాదన్నారు.

తమ ప్రతినిధులు ఎలా వ్యవహరిస్తున్నారో ఇంట్లోనే కూర్చొని తిలకించే అవకాశం ఏర్పడిందని.. దీనివల్ల ప్రజాప్రతినిధుల ప్రవర్తనను ప్రజలు బేరీజు వేస్తారన్నారు. శాసనసభా బడ్జెట్‌ తాజాగా రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయడానికే సభా నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిపాదించి.. ఇదే శాసనసభ అభిప్రాయమని (మూడ్‌ ఆఫ్‌ ది హౌజ్‌) వెల్లడించిన విషయం తెలిసిందే.

సభలో కొందరు దుందుడుకుగా వ్యవహరిస్తున్నారని ప్రచారం కోసమే రభస సృష్టిస్తున్నారనే ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో సోమనాథ్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

Show comments