Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎం-పేసా సేవలను ప్రవేశపెట్టిన వోడాఫోన్ - ఐసీఐసీ!!

Webdunia
సోమవారం, 24 మార్చి 2014 (18:29 IST)
WD
WD
దేశంలోని ప్రైవేట్ టెలికాం ఆపరేటింగ్ సంస్థ వోడాఫోన్, ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ అయిన ఐసీఐసీఐ బ్యాంకులు సంయుక్తంగా ఎం-పేసా పేరుతో మొబైల్ బ్యాంకింగ్ సేవలను ప్రవేశపెట్టాయి. ఈ సేవలను తమిళనాడు రీజియన్‌లోని మొత్తం 33 జిల్లాల్లోని 200 యూనిట్‌లలో ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు తెచ్చారు.

ఇదే అంశంపై వోడాఫోన్ ఇండియా సౌత్ ఆపరేషన్ డైరక్టర్ సురేష్ కుమార్, తమిళనాడు, చెన్నై బిజినెడ్ హెడ్ అపూర్వ మహ్రోత్రా, ఎం-పేసా బిజినెజ్ హెడ్ సురేష్ సేథీలు ఈ సేవలను సోమవారం చెన్నైలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర మొబైల్ నగదు బదిలీ, నగదు బట్వాడా సర్వీసును ఎం-పేసా పేరుతో ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఈ సేవ ద్వారా బ్యాంకు ఖాతా లేని వారు లబ్ధి పొందవచ్చన్నారు. ఈ సేవల కోసం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు, శిక్షణ పొందిన 5103 మంది ఏజెంట్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 840 వోడాఫోన్ ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లలో అందుబాటులో ఉంటాయన్నారు.

తమ గుర్తింపు పొందిన ఔట్‌లెట్ల నుంచి నగదు డిపాజిట్లు, విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపారు. అలాగే, భారతదేశంలోని ఏ మొబైల్‌కైనా నగదును బదిలీ చేసుకోవచ్చని వివరించారు. మొబైల్ రీచార్జ్, డీటీహెచ్ సర్వీస్ నెలవారీ చందాలు, యుటిలిటీ బిల్లు చెల్లింపులు సేవలు పొందవచ్చన్నారు. అలాగే, ఎంపిక చేసిన షాపుల్లో షాపింగ్ చేయవచ్చని, నగదు డిపాజిట్ చేసి, తద్వారా వడ్డీని పొందవచ్చని, ఈ-కామర్స్, ఎం-కామర్స్ సేవల్లో పాలు పంచుకోవచ్చని వివరించారు.

ఎం-పేసా సేవలను పొందేందుకు మొబైల్ వినియోగదారుడు నాలుగు దశలను చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎం-పేసా ఔట్‌లెట్లు లేదా మొబైల్ ఫోన్ నుంచి రిజిస్టర్ చేసుకోవాలి. సెల్ఫ్ రిజిస్టర్ ఫామ్‌ను భర్తీ చేసి, ఇంటి చిరునామా, గుర్తింపు ఫోటోతో పాటు.. తగిన మొత్తంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఎం పేసా ఖాతా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మీరు సమర్పించిన దరఖాస్తును ఎసీఎస్ఎల్, ఐసీఐసీఐ పరిశీలించి.. అంగీకారం తెలుపుతారని తెలిపారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments