Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్లర్లో బూతు చిత్రాల షేరింగులకు చెక్!

Webdunia
శుక్రవారం, 7 మార్చి 2014 (12:26 IST)
FILE
సామాజిక వెబ్‌సైట్లు యువతకు ఎంతమేలు చేస్తున్నాయో అంతే చెడును కూడా చేస్తున్నాయి. ట్వట్టిర్‌లో తక్కువ నిడివిగల బూతు చిత్రాల ద్వారా యువత పక్కదోవపడుతోందని భావించిన ట్విట్టర్ యాజమాన్యం ఈ బూతు చిత్రాల షేరింగులకు చెక్ పెట్టింది.

మొబైల్ అప్లికేషన్ వైన్ ద్వారా పోర్నోగ్రఫీ కంటెంట్ షేరింగ్‌ను నిషేధిస్తూ ట్విట్టర్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వైన్ ద్వారా యూజర్లు ఆరు సెకన్ల వీడియోలను షేర్ చేసుకునే అవకాశం ఉండేది. దీంతో పోర్న్ తారలు, పోర్న్ హబ్ వంటి వెబ్‌సైట్లు కూడా సంక్షిప్త బూతు వీడియోలను పంపుకోవడానికి, ఆ బూతు చిత్రాల ప్రచారం కోసం వైన్ అప్లికేషన్‌ను వినియోగించుకుంటున్నాయి.

ఇకపై ఈ అవకాశం ఉండదు. మర్మాంగ ప్రదేశాలను చూపించే పోర్నోగ్రఫీ వీడియోలు ఈ నిషేధం పరిధిలోకి వస్తాయని ట్విట్టర్ స్పష్టం చేసింది. అదే సమయంలో నగ్న నిరసనలు, పిల్లలకు పాలు పట్టడం వంటి శృంగార రహిత వీడియోలు ఇకపైనా పంపుకోవడానికి వీలుంటుందని యూజర్లకు తెలియజేసింది. ఫేస్‌బుక్‌లోనూ ఇలాంటి నిషేధాలే అమల్లో ఉన్నాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు