Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ పెట్టుబడుల రూపంలో రూ.28 కోట్లు పొందిన రైల్వే

Webdunia
భారత రైల్వేల చరిత్రలో తొలిసారిగా ప్రైవేట్ పెట్టుబడుల రూపంలో 28 కోట్ల రూపాయలను పొందింది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన చట్టబద్ధ అనుంబంధ సంస్థ రైల్ ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఆర్ఎల్‌డీఏ) రైల్వే భూముల నుంచి ఆదాయాన్ని పొందేలా చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా రైల్వే శాఖ ఎంపిక చేసిన స్టేషన్‌లలో మల్టీ ఫంక్షనల్ కాంప్లెక్స్ (ఎంఎఫ్‌సీ)ల అభివృద్ధికి ప్రైవేట్ డెవలపర్ల నుంచి బిడ్‌లను ఆహ్వానించింది.

ఈ డెవలపర్స్ రైల్వే శాఖ ఎంపిక చేసిన కటక్, డెహ్రాడూన్, ఝాన్సీ, కత్రా, నాందేడ్ స్టేషన్లలో రైల్వేకు సొంతమైన భూముల్లో ఎంఎఫ్‌సీలను ఏర్పాటు చేస్తుంది. ప్రైవేట్ పెట్టుబడుల సాయంతో ఇలాంటి ఎంఎఫ్‌సీలను ఏర్పాటు చేయనుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, దేశ వ్యాప్తంగా భారతీయ రైల్వే పరిధిలో సుమారు ఏడువేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

రైల్వే భూముల్లో ఎంఎఫ్‌సీలను ఎర్పాటు చేసే విధానాన్ని 2009-10 బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. రైలు ప్రయాణికులకు స్టేషన్లలో మరిన్ని మెరుగైన సౌకర్యాలను కల్పించే నిమిత్తం ఈ కాంప్లెక్స్‌లను నెలకొల్పుతారు. ఇందులో షాపింగ్, ఫుడ్‌స్టాల్స్, రెస్టారెంట్స్, బుక్ స్టాల్స్, ఏటీఎం కేంద్రాలు, మెడికల్ షాపులు, బడ్జెట్ హోటల్స్, పార్కింగ్‌లతో పాటు ఇతర సౌకర్యాలను కల్పిస్తారు.

2009-10 లో ప్రకటించినట్టుగా మొదటి దశలో మొత్తం 48 ఎంఎఫ్‌సీలను అభివృద్ధి చేస్తుంది. వీటిలో ఆరు ఎంఎఫ్‌సీలను కటక్, డెహ్రూడూన్, ఝాన్సీ, కత్రా, నాందేడ్, ఉజ్జయినిలలో అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. 2010-11లో ప్రకటించినట్టుగా రెండో దశలో దేశ వ్యాప్తంగా 86 ఎంఎఫ్‌సీలను ఆర్ఎల్‌డీఏ అభివృద్ధి చేస్తుంది. రెండో దశ ప్రాజెక్టు కోసం త్వరలోనే బిడ్డింగ్ కోరనున్నారు.

ఎంఎఫ్‌సీలను ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివవృద్ధి చేసేందుకు గాను మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థను ఆర్ఎల్‌డీఏ నియమించింది. తొలి దశలో అభివృద్ధి చేయదలచిన ఆరు ఎంఎఫ్‌సీలలో ఐదింటిని ఈ మార్కెటింగ్ సంస్థ ఎంపిక చేసింది. ఇందులో కటక్ ఎంఎఫ్‌సీని కేషరీ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, డెహ్రాడూన్, నాందేడ్‌లను జనక్ హోల్డింగ్స్,, ఝాన్సీలో భగవతి ఇన్‌ఫ్రీస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, కత్రాలో ఎంజీసీ ఎస్టేట్స్‌ సంస్థలు అభివృద్ధి చేస్తారు. ఉజ్జయిని ఎంఎఫ్‌సీ కోసం వచ్చిన బిడ్‌ను మాత్రం ఆర్ఎల్‌డిఏ నిరాకరించింది. ఈ బిడ్డింగ్‌ల రూపంలో రైల్వే రూ.28 కోట్లను పొందింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు