Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈనెల 19వ తేదీన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ప్రణబ్ భేటీ!

Webdunia
ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల యూపీఏ పాలకులను హడలెత్తిస్తోంది. గత వారంలో 18.31 శాతంగా ఉన్న ఈ ద్రవ్యోల్బణం జనవరి ఒకటో తేదీతో ముగిసిన వారాంతానికి 16.91 శాతానికి పడిపోయింది. ఇంత మొత్తంలో ద్రవ్యోల్బణం ఉండటాన్ని ఆర్థిక శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇదే అంశంపై చర్చించేందుకు ఈనెల 19వ తేదీన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర విత్తమంత్రి ప్రణబ్ ముఖర్జీ భేటీకానున్నారు.

దీనిపై మంత్రి ప్రణబ్ మాట్లాడుతూ ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుత స్థాయిలో అంగీరించలేమన్నారు. దీన్ని వీలైనంత మేరకు తగ్గించేందుకు రాష్ట్రాల సహకారంతో తమ శాయశక్తులా కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఇదే అంశంపై చర్చించేందుకు ఈనెల 19వ తేదీన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్నట్టు చెప్పారు.

కాగా, ఆరు వారాల తర్వాత 16.91 శాతానికి ఆహార ద్రవ్యోల్బణం తగ్గింది. అయినప్పటికీ.. ఉల్లిపాయలతో పాటు ప్రోటీన్‌తో కూడిన ఆహార పదార్థాల ధరలు మండుతున్నాయి. వీటీతో పాటు వివిధ రకాల ఆహార పదార్థాల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఫలితంగా డిసెంబరులో 7.48 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం 8.43 శాతానికి చేరుకుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా కాంబినేషన్ షురూ

హైలెస్సో హైలెస్సా అంటూ పాడుకుంటున్న నాగ చైతన్య, సాయి పల్లవి

చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

యూఫోరియా మ్యూజికల్ నైట్ లో ప్రతి ఒక్క రూపాయి సమాజ సేవకే : నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

Show comments