Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ దుర్ఘటన విచారణపై త్రిసభ్య కమిటీ

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2010 (12:28 IST)
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీలో నైట్రోజన్ గ్యాస్ లీకేజీ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ విభాగానికి చెందిన ఇద్దరు సభ్యులు, ఫార్మా రంగానికి చెందిన ఒక నిపుణుడుకి చోటు కల్పించారు.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ఫార్మా డొమైన్ నిపుణుడిని డైక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ త్వరలోనే నియమించనున్నట్టు తెలిపారు. నైట్రోజన్ వాయువును వినియోగిస్తున్న అన్ని ఫార్మా ఫ్యాక్టరీలలో తనిఖీ చేసేందుకు డొమైన్ నిపుణుడు ఎంతో అవసరమని ప్రతినిధి వెల్లడించారు.

కాగా, గత మంగళవారం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లో నైట్రోజన్ వాయువు లీకై ఒక కెమిస్ట్‌తో పాటు.. కాంట్రాక్టు వర్కర్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. మానవాళికి ఉపయోగపడే మందులను తయారు చేసేందుకు బొల్లారంలోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ ప్రమాదం మిగిలిన ఫార్మా పరిశ్రమల్లో పని చేసే కార్మికుల భద్రతపై సమీక్ష చేయాల్సి వచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్.ఆర్.ఆర్. సంగీత శక్తిని మరోసారి లండన్‌లో ప్రదర్శించనున్న కీరవాణి

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

మట్కా ట్రైలర్ పై చిరంజీవి స్పందన - మట్కాలో నేనే హీరో, విలన్ కూడా : వరుణ్ తేజ్

పుష్ప-2 ఐటం గర్ల్‌గా శ్రీలీల..!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

Show comments