Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే సరకుల రవాణా నాలుగు శాతం ఛార్జీల పెంపు?

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2010 (11:15 IST)
ఈనెల 27వ తేదీ నుంచి సరకుల రవాణా ఛార్జీలను నాలుగు శాతం పెంచాలని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఛార్జీల పెంపు నుంచి నిత్యావసరవస్తువులకు మినహాయింపు ఇచ్చింది. ఈ పెంపుపై గుజరాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి సౌరభ్ పటేల్ మండిపడ్డారు. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గుజరాత్ విద్యుత్ రంగంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని రకాల విద్యుత్ వినియోగదారులకు అదనపుభారం కానుందని ఆయన గుర్తు చేశారు.

విద్యుత్ ఉత్పత్తి ధర పెరగడం వల్ల ఖచ్చితంగా ఇంధన సర్‌ఛార్జ్ పెరుగుతుందన్నారు. సరకుల రవాణా ఛార్జీల పెంపుదల రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎక్కువగా నేలబొగ్గు ఆధారిత ప్లాంట్‌లని ఆయన గుర్తు చేశారు.

ఈ విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గును ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి గుజరాత్ దిగుమతి చేసుకుంటుండగా, ఈ రవాణా ఎక్కువగా గూడ్సురైళ్ల వ్యాగన్‌ల ద్వారానే తరలిస్తున్నారని గుర్తు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్.ఆర్.ఆర్. సంగీత శక్తిని మరోసారి లండన్‌లో ప్రదర్శించనున్న కీరవాణి

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

మట్కా ట్రైలర్ పై చిరంజీవి స్పందన - మట్కాలో నేనే హీరో, విలన్ కూడా : వరుణ్ తేజ్

పుష్ప-2 ఐటం గర్ల్‌గా శ్రీలీల..!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

Show comments