Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీకు మ్యాక్స్ మొబైల్ బంపర్ ఆఫర్: 29 కోట్ల డీల్

Webdunia
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ రేట్ రోజు రోజుకు పెరిగిపోతుంది. క్రికెట్‌లో తాను చూపుతున్న ప్రతిభతో పలు కంపెనీలను ధోనీ ఇట్టే ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే ప్రముఖ పారిశ్రామికవేత్త, శాసనసభ సభ్యుడు విజయమాల్యకు చెందిన యూబి గ్రూపుతో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్న ధోనీకు మరో బంపర్ ఆఫర్ లభించింది.

మ్యాక్స్ మొబైల్ కంపెనీకు ఏడేళ్లపాటు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగడానికి గానూ రూ. 29 కోట్ల విలువ చేసే డీల్‌పై ధోనీ సంతకం చేశాడు. ధోనీను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడం వల్ల తమ ఉత్పత్తులకు అత్యుత్తమ ప్రచారం లభిస్తుందిని మ్యాక్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ అగర్వాల్ పిటిఐకు తెలిపారు.

కాగా.. గత వారంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్పిరిట్ తయారీ సంస్థ యూబి గ్రూపుతో ధోనీ రూ. 26 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇది కుదిరిన కొద్ది రోజుల్లోనే మరో అతిపెద్ద డీల్‌పై‌ ధోనీ సంతకం చేయడం విశేషం.

భారత్‌లో ఇటీవల ప్రవేశించిన మొబైల్ కంపెనీలలో మ్యాక్స్ మొబైల్ కూడా ఒకటి. రెండేళ్లలోపే మ్యాక్స్ లక్షల సంఖ్యలో హ్యాండ్ సెట్లను విక్రయించిది. అధునాతన ఫీచర్లు కలిగిన మొబైల్ ఫోన్లు చవక ధరలకే అందించడం మ్యాక్స్ ప్రత్యేకత.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామలక్ష్మణులు కల్పిత పాత్రలు - బహిరంగ క్షమాపణలు చెప్పిన శ్రీముఖి (Video)

'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ సర్కారు అనుమతి నిరాకరణ!!

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

Show comments