Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతుల వస్త్రధారణపై నా భర్త చేసిన వ్యాఖ్యలు సబబే : ఉత్తరాఖండ్ సీఎం భార్య

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (13:29 IST)
యువతుల వస్త్రధారణపై ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోకాళ్లు కనిపించేలా చిరిగిన జీన్స్ ధరించడం సరికాదన్నారు. ఇలాంటి కత్తెర దుస్తులు సంస్కృతి విచ్ఛిన్నానికి కారణమవుతుందన్నారు. ఇలాంటి వస్త్రధారణ వల్ల వారు లైంగిక వేధింపులకు కూడా గురయ్యే అవకాశం ఉందన్నారు. 
 
పాశ్యాత్య దేశాల ప్రజలు మన దేశ సాంప్రదాయాలను పాటిస్తుంటే... మనం మాత్రం నగ్నత్వం వైపు పరుగులు తీస్తున్నామని మండిపడ్డారు. రావత్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలతో పాటు కొందరు సెలబ్రిటీలు ఈ వ్యాఖ్యలను ఖండించారు. రావత్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో రావత్ వ్యాఖ్యలను ఆయన భార్య రష్మి త్యాగి సమర్థించారు. 'ఆయన చేసిన వ్యాఖ్యలో తప్పేమీ లేదు. ఆయన వ్యాఖ్యల పూర్తి సారాంశాన్ని సరిగా చూపించలేదు. మన సమాజాన్ని, దేశాన్ని నిర్మించడంలో మహిళల పాత్ర అపూర్వమైనదన్నారు. మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, మన ఉనికిని, మన వస్త్రధారణను కాపాడాల్సిన బాధ్యత భారతీయ మహిళలపై ఉందని చెప్పారు' అని రష్మి అన్నారు. అనవసరంగా ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం