Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయి పేరుతో ఎఫ్.బి. ఖాతా.. 14 మంది అమ్మాయిలను మోసం చేసిన యువకుడు

ఓ యువకుడు అమ్మాయి పేరుతో ఫేస్‌బుక్ ఖాతాను తెరిచి.. ఆ ఖాతా ద్వారా 14 మంది అమ్మాయిలను మోసం చేసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాల ఆశ చూపించడంతో ఆ అమ్మాయిలు మోసపోయారు. ఈ వివరాలను పరిశీలిస్తే

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (13:54 IST)
ఓ యువకుడు అమ్మాయి పేరుతో ఫేస్‌బుక్ ఖాతాను తెరిచి.. ఆ ఖాతా ద్వారా 14 మంది అమ్మాయిలను మోసం చేసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాల ఆశ చూపించడంతో ఆ అమ్మాయిలు మోసపోయారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
మహారాష్ట్రలోని భివాండీలో నివసించే విశ్వనాథ్ పాటిల్ అనే యువకుడు సోషల్ మీడియాలో జయా పాటిల్ అనే అమ్మాయి పేరుతో నకిలీ ఖాతా ఓపెన్ చేశాడు. ఈ ఖాతా ద్వారా ఉద్యోగాల కోసం వెతుకున్న యువతులను పరిచయం చేసుకున్నాడు. వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి.. వారి వద్ద డబ్బులు, విలువైన వస్తువులను తీసుకుంటూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో అతడి చేతిలో మోసపోయిన ఇద్దరు అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసగాడి బాగోతం బట్ట బయలు అయింది. జయ మహిళ కాదని కల్యాణ్‌‌కి చెందిన వ్యక్తి అని తెలుసుకున్న పోలీసులు.. ఫిర్యాదు చేసిన ఓ యువతితో కలిసి నిందితుడిని పట్టుకునేందుకు ఎత్తుగడ వేశారు. 
 
ఫిర్యాదు చేసిన ఓ యువతితో ఫోన్ చేయించి తాను కల్యాణ్‌‌లోనే ఉన్నానని.. కలవాలని చెప్పడంతో విశ్వనాథ్‌ పాటిల్ అక్కడికి వచ్చాడు. అతడు వచ్చే రాగానే.. పోలీసులు చుట్టూ మూగి అతన్ని అరెస్ట్ చేశారు. విశ్వనాథ్‌ ఇప్పటివరకు 14 మంది యువతులను ఇలా మోసం చేశాడని పోలీసులు  చెప్పారు. దీంతో పాటిల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments