Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తదానం పేరుతో కిడ్నీ కాజేసిన వైద్యులు...

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (15:03 IST)
రక్తదానం పేరుతో ఏకంగా కిడ్నీనే కొట్టేశారు వైద్యులు. తమిళనాడు రాష్ట్రంలోని మదురైకు చెందిన రాజా మహ్మద్ అనే వ్యక్తి తన అక్క కుమారుడు అజారుద్దీన్‌కి ఆరోగ్యం సరిగ్గాలేదని, వెంటనే అతనికి రక్తం ఎక్కించాలని మహ్మద్ ఫక్రుద్దీన్ అనే వ్యక్తిని కోరాడు. స్నేహితుడు అడుగుతున్నాడని ఫక్రుద్దీన్ రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. 
 
అయితే తనను ఆసుపత్రికి తీసుకువెళ్లిన నిందితుడు అసలు విషయం చెప్పలేదు. డాక్టర్లు నీ రక్తం తీసుకుంటామని, అయితే దానికి ముందు కొన్ని చికిత్సలు చేయాలని చెప్పారు. దానికి అతను సమ్మతించాడు. కొన్నాళ్ల తర్వాత అనారోగ్యానికి గురైన ఫక్రుద్దీన్ ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యులు పరీక్ష చేసి ఒక కిడ్నీ లేదని చెప్పారు. దాంతో అతను షాక్‌కి గురయ్యాడు. 
 
తాను మోసపోయానని గ్రహించాడు. ఈ ఘటనపై బాధితుడి తల్లి షకీలాబాను పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అసలు నిజాన్ని బయటకు కక్కించారు. మేనల్లుడికి కిడ్నీ పాడైందని, కిడ్నీ ఇవ్వడానికి ఎవరూ ముందుకురారని ఇలా చేశానని. ఆ కిడ్నీని అతడిని అమర్చారని రాజా మహ్మద్ ఒప్పుకున్నాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments