Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రత కుదింపు... అఖిలేష్ - మాయావతిలకు సీఎం యోగి షాక్

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక సంచలన నిర్ణయాలతో ముందుకుసాగిపోతున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయాలకు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఆయన నిర్ణయాలకు ఉలిక్కిపడుతున్

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (11:53 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక సంచలన నిర్ణయాలతో ముందుకుసాగిపోతున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయాలకు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఆయన నిర్ణయాలకు ఉలిక్కిపడుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు, బీఎస్‌పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతిలకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను తగ్గించారు. 
 
శనివారం రాత్రి జరిగిన సెక్యూరిటీ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నూతన డీజీపీ సుల్ఖాన్ సింగ్, హోం శాఖ ప్రధాన కార్యదర్శి, ఇంటెలిజెన్స్ ఏడీజీ, సెక్యూరిటీ ఏడీజీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. భద్రతను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని శనివారం రాత్రి నుంచే అమల్లోకి తెచ్చారు. 
 
అఖిలేశ్ యాదవ్, మాయావతిలకు మాత్రమే కాకుండా సమాజ్ వాదీ పార్టీ నేతలు శివ్‌పాల్ యాదవ్, డింపుల్ యాదవ్, అజం ఖాన్‌లకు కూడా భద్రతను తగ్గించారు. మరోవైపు బీజేపీ నేత వినయ్ కతియార్‌కు భద్రతను పెంచి, జడ్ కేటగిరి పరిధిలోకి తీసుకుని రావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments