Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత దేశానికి తాజ్ మహల్ గుర్తింపు చిహ్నం కాదు: యోగి ఆదిత్యానాథ్

ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ భారత దేశానికి తాజ్ మహల్ గుర్తింపు చిహ్నం కాదన్నారు. భారత్ లో అత్యధిక పర్యాటకులు సందర్శించే స్థలం ఆగ్రా అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కానీ.. ప్రేమకు చిహ్నం, ప్రపంచ ఏడు

Webdunia
శనివారం, 1 జులై 2017 (09:30 IST)
ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ భారత దేశానికి తాజ్ మహల్ గుర్తింపు చిహ్నం కాదన్నారు. భారత్ లో అత్యధిక పర్యాటకులు సందర్శించే స్థలం ఆగ్రా అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కానీ.. ప్రేమకు చిహ్నం, ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ ఆధారంగా దేశానికి గుర్తింపునిచ్చే ప్రయత్నం చేయడం సరైంది కాదని యోగి వ్యాఖ్యానించారు. రామమందిర నిర్మాణం కోసం రాళ్లు సమకూర్చేందుకు తన అనుమతి అవసరం లేదని యోగి అన్నారు. 
 
రామ మందిర నిర్మాణం విషయంలో ప్రజలకు తనపై ఉన్న నమ్మకాన్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని యోగి తెలిపారు. అయితే రామమందరం నిర్మాణంపై నెలకొన్న వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకోవాలన్న సుప్రీంకోర్టు సూచనకు కట్టుబడి ఉన్నానన్నారు. ఈ అంశంలో ఇరువర్గాల మధ్య చర్చలు జరగకుండా సమస్య పరిష్కారం కాదని ఆయన చెప్పారు. 
 
ఇదిలా ఉంటే.. సీఎంగా యోగి ఆదిత్యనాథ్ పగ్గాలు చేపట్టాక.. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి అనూహ్యంగా ముస్లింలు మద్దతు తెలుపుతున్నారు. రామ మందిరం నిర్మించాలంటూ ఇటీవల లక్నోలో ముస్లింలు బ్యానర్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments