Webdunia - Bharat's app for daily news and videos

Install App

చట్టంపై గౌరవం లేకపోతే రాష్ట్రాన్ని వదిలిపొండి..ఎవ్రీ ఓట్‌ ఫర్‌ మోదీ అని..?: యోగి

చట్టం అంటే గౌరవం లేనివారు రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎర్రబుగ్గలను రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయాన్ని యోగి కొనియాడారు. వేగంగా చట్టాల

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (10:49 IST)
చట్టం అంటే గౌరవం లేనివారు రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎర్రబుగ్గలను రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయాన్ని యోగి కొనియాడారు. వేగంగా చట్టాలను మారుస్తున్నామని.. ఇంతకుముందు చెప్పినట్లుగానే చట్టం అంటే గౌరవం లేనివారు.. రాష్ట్రాన్ని వీడాలన్నారు. చట్టాలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 
 
ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై మాట్లాడుతూ 'ప్రతి ఓటూ మోడీకే' అన్న వ్యాఖ్యకు ఇవిఎంలు కట్టుబడ్డాయని ఢిల్లీ ప్రజలు మరోసారి నిరూపించారన్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి యోగి పరోక్షంగా చురకలంటించారు. ‘ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టడంద్వారా ప్రజలు ఈవీఎం అంటే ‘ఎవ్రీ ఓట్‌ ఫర్‌ మోదీ’ అని నిరూపించారు. 
 
పంజాబ్‌, యూపీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఈవీఎంల పనితీరుపై ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశయాదవ్‌ చేసిన ఆరోపణలు అర్థరహితమని విమర్శించారు. దేశంలో వీఐపీ సంస్కృతిని తరిమికొట్టడం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ కొత్త చరిత్రకు నాంది పలికారని, ఉత్తరప్రదేశలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments