Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ బాటలో యోగి.. రూ. 3కే అల్పాహారం.. రూ.5కే కడుపునిండా భోజనం.. అన్నపూర్ణ భోజనాలయాస్ పేరిట?

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అమ్మ బాటలో పయనిస్తున్నారు. దేశంలో తొలిసారిగా తమిళనాడు రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి జయలలిత అమ్మ క్యాంటీన్లు పేరుతో చౌక ధరకే ఆహార పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్యాంటీ

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (17:37 IST)
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అమ్మ బాటలో పయనిస్తున్నారు. దేశంలో తొలిసారిగా తమిళనాడు రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి జయలలిత అమ్మ క్యాంటీన్లు పేరుతో చౌక ధరకే ఆహార పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్యాంటీన్లు పేదలకు ఆకలిబాధను తీర్చుతున్నాయి. ఇదేవిధంగా యూపీ సీఎం యోగి కూడా పేద ప్రజల ఆకలిని తీర్చనున్నారు.  
 
ప్రజా సంక్షేమ విషయంలో ఏమాత్రం రాజీ పడని యోగి రోజు రోజుకీ దూకుడును పెంచుతున్నారు. తాజాగా పేదల ఆకలిని తీర్చడమే లక్ష్యంగా త్వరలో ఉత్తరప్రదేశ్‌లో రూ.5కే కడుపునిండా భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు యోగి సర్కారు వెల్లడించింది. ఈ విషయాన్ని సీఎం కార్యాలయ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
 
ఈ భోజన పథకం కింద రూ.3కే అల్పాహారం ఇస్తారు. ఈ అల్పాహారంలో వివిధ రకాల ఆహార పదార్థాలను అందిస్తామని, తేనీరు కూడా ఇస్తామని సీఎం కార్యాలయం తెలిపింది. అన్నం, రొట్టెలు, కూరగాయలతో పాటు రుచికరమైన భోజనాన్ని మధ్యాహ్నం పూటే కాకుండా రాత్రి కూడా అందిస్తామని యూపీ సీఎం కార్యాలయం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా 200 సెంటర్లు ఏర్పాటు కానుండగా.. ఈ పథకానికి  సంబంధించిన ముసాయిదా ప్రస్తుతం తయారవుతుందని సీఎం కార్యాలయం తెలిపింది. ఈ కేంద్రాలు అన్నపూర్ణ భోజనాలయాస్ పేరిట నడుస్తాయి. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments