Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో కొనసాగుతున్న రైజర్ల ఆందోళన... రైతులు మద్దతు

Webdunia
ఆదివారం, 7 మే 2023 (12:10 IST)
రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు, భాజపా ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ రెజ్లర్లు చేపట్టిన ఆందోళనకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. తాజాగా రెజ్లర్ల ఆందోళనకు రైతు సంఘం సంయుక్త కిసాన్‌ మోర్చా మద్దతు తెలిపింది. ఇందులోభాగంగా వారి ఆందోళనకు సంఘీభావం తెలియజేసేందుకు సంఘం నేతలు ఆదివారం ఢిల్లీకి పయనమయ్యారు. 
 
ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల నుంచి ఖాప్‌ పంచాయితీ నేతలు సైతం రెజ్లర్ల ఆందోళన స్థలికి బయల్దేరడంతో జంతర్‌ మంతర్‌తో పాటు ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్రిజ్‌ భూషణ్‌ను తొలగించాలంటూ జంతర్‌ మంతర్‌ వద్ద గడిచిన 10 రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ క్రమంలో ఆదివారం వారికి సంఘీభావం తెలిపేందుకు పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన రైతు నేతలు దిల్లీకి బయల్దేరారు. ఈ క్రమంలోనే టిక్రి బోర్డర్‌ వద్ద రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రైవేటు వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని, ట్రాక్టర్లకు అనుమతి లేదని తిప్పి పంపుతున్నారు.
 
మరోవైపు ఒకరోజు సంఘీభావం తెలియజేసేందుకు తాము ఢిల్లీ వెళుతున్నామని, ఒకవేళ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని రైతు నేతలు ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు రెజ్లర్లకు మద్దతుగా దేశవ్యాప్త నిరసనలు చేపడతామని ఇప్పటికే సంయుక్త కిసాన్‌ మోర్చా పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

రివాల్వర్ రీటా గా కీర్తి సురేశ్‌ - రైట్స్ దక్కించుకున్న రాజేష్ దండా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments