Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోని మేధావులను కాల్చిపారేయాలి : బీజేపీ ఎమ్మెల్యే

దేశంలోని మేధావులను కాల్చిపారెయ్యాలంటూ బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆ ఎమ్మెల్యే పేరు బసవన గౌడ్ పాటిల్ యత్నాల్. కర్ణాటక రాష్ట్రంలోని విజ‌య‌పుర నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నా

Webdunia
శనివారం, 28 జులై 2018 (13:08 IST)
దేశంలోని మేధావులను కాల్చిపారెయ్యాలంటూ బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆ ఎమ్మెల్యే పేరు బసవన గౌడ్ పాటిల్ యత్నాల్. కర్ణాటక రాష్ట్రంలోని విజ‌య‌పుర నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.
 
కార్గిల్ దివ‌స్ సంద‌ర్భంగా విజ‌య‌పుర‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్రమంలో ఆయ‌న మాట్లాడుతూ, తానేగ‌నుకు కేంద్ర హోం శాఖ మంత్రినై ఉంటే దేశంలోని మేధావుల‌ను కాల్చి చంప‌మ‌ని పోలీసుల‌కు ఆదేశాలు ఇచ్చేవాడిన‌ంటూ వ్యాఖ్యానించారు. ఉదార‌వాదులు, మేధావులు జాతి వ్య‌తిరేకుల‌ని ఆయ‌న అభివ‌ర్ణించారు. 
 
మన దేశంలో చాలా మంది మేధావులు ఉన్నారనీ, వీరంతా మనం చెల్లించే సొమ్ముతో సకల సౌకర్యాలు పొందుతారని చెప్పారు. అదేసమయంలో భారత సైన్యంపై విమర్శలు గుప్పిస్తారని తెలిపారు. ఇత‌రుల‌కంటే మేధావులు, సెక్యుల‌రిస్టుల నుంచి మ‌న దేశానికి పెద్ద ప్ర‌మాద‌ముందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
కాగా, ఉత్తర భారతంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఇటీవలి కాలంలో నోటికి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న విషయం తెల్సిందే. ఇపుడు కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వారి మార్గాన్నే అనుసరిస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments