Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులోని ఓ పాపులర్ కేఫ్‌‌.. పొంగలిలో పురుగు.. అదంతా సోషల్ మీడియా స్టంటా?

సెల్వి
శుక్రవారం, 25 జులై 2025 (09:26 IST)
Pongal
బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో ఉన్న ఓ పాపులర్ కేఫ్‌లో తాను ఆర్డర్ చేసిన పొంగల్ వంటకంలో పురుగు కనిపించిందని ఓ కస్టమర్ ఆరోపించింది. అయితే, కేఫ్ వ్యవస్థాపకురాలు దివ్య రాఘవేంద్ర మాత్రం ఇదంతా డబ్బు వసూలు చేయడానికి దురుద్దేశంతో చేసిన చర్య అంటూ మండిపడ్డారు. 
 
గతంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. కస్టమర్లు గతంలో ఆహారంలో రాళ్ళు, కీటకాలు వేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని దివ్య అంటున్నారు. ఐదు నుంచి ఏడుగురు వ్యక్తుల బృందం ఆహారంలో 'పురుగు' ఉందని తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా ప్రజలను కలవరపెట్టి, ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో ప్రసారం చేస్తామని బెదిరించిందని దివ్య తెలిపారు. 
 
ఆ వీడియోను ప్రసారం చేయకుండా ఉండటానికి ఆ బృందం రూ. 25 లక్షలు డిమాండ్ చేసిందని ఆరోపించారు. బ్రాండ్ ఇమేజ్‌ను కించపరచడానికి, డబ్బును వసూలు చేయడానికి ప్రయత్నించినందుకు ఆ బృందంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని దివ్య వెల్లడించారు.
 
ఇదేవిధంగా తాజాగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో పొంగలిలో పురుగు అని ఆరోపిస్తూ రెండు వీడియో క్లిప్‌లు ప్రసారం అయ్యాయి. కస్టమర్ హోటల్ సిబ్బందితో "నీకు అది కనిపించిందా?" అని కోపంతో అడిగాడు. వెంటనే కస్టమర్‌కు వడ్డించిన సిబ్బంది పొంగల్‌లో పురుగు పరిశీలించి క్షమాపణలు చెప్పాడు. అయితే ఇదంతా సోషల్ మీడియా పాపులారిటీ కోసమని హోటల్ యాజమాన్యం కొట్టిపారేసింది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments