Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజ పేరుతో మత్తుమందిచ్చి ఐదేళ్ల పాటు అత్యాచారం..

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (14:25 IST)
ఆధునికత పెరిగినా మూఢనమ్మకాలు మరుగున పడట్లేదు. దొంగ బాబాలను నమ్మి మోసపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా బెంగళూరులో మత్తు మందు ఇచ్చి ఓ నకిలీ బాబా ఐదేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

దొంగ బాబా ఆ మహిళకు వివాహం కాకుండా అడ్డుకుంటూ.. ఐదేళ్ల పాటు బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరు మల్లేశ్వరంలో వివాహం కాకపోవడంతో పరిహారం కోసం కుటుంబ సభ్యుల సూచనలతో ఐదేళ్ల క్రితం ఆనందమూర్తి అనే బాబాను కలిశానని చెప్పింది బాధితురాలు.

పూజ చేస్తున్న సమయంలో ఇచ్చిన పానీయంతో స్పృహ తప్పిన తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఆ సమయంలో అతని భార్య లత తన ఫోనులో రికార్డ్ చేసిందని చెప్పింది.

ఈ వీడియోను అడ్డం పెట్టుతుని ఐదేళ్ల పాటు తనపై దొంగ బాబా అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడని.. మూడేళ్ల పాటు పెళ్లిని చెడగొడుతున్నాడని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బెదిరింపులకు గురిచేయడంతో ఇప్పటికే లక్ష రూపాయలు ఇచ్చామని.. పోలీసులకు చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments