Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ న్యూస్.. ట్రయల్ రూమ్‌లో డ్రెస్ మార్చుకుంటున్నారా?

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (17:52 IST)
ఓ షాకింగ్ ఘటన దక్షిణ ఢిల్లీలో చోటుచేసుకుంది. ఓ జర్నలిస్టు ట్రయల్ రూమ్‌లో దుస్తులు మార్చుకుంటున్నప్పుడు ఫోటోలు, వీడియోలు తీశారని ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఢిల్లీ ఎమ్ బ్లాక్ మార్కెట్లోని ప్రముఖ ఇన్నర్‌వేర్ దుస్తుల కొట్టుకు 27 ఏళ్ల జర్నలిస్టు వెళ్లారు. అక్కడ కొన్ని దుస్తులను ఎంపిక చేసిన ఆమె ట్రయల్ రూమ్‌లోకి వెళ్లింది. 
 
ఆ జర్నలిస్టు సగం దుస్తులు ధరించి వుండగా, దుకాణంలోని ఒక సిబ్బంది తలుపు తట్టారని, గదిలో సీసీటీవీ ఉందని సిబ్బంది చెప్పడంతో.. జర్నలిస్ట్ ఆమె దుస్తులను పైకి లాక్కుని తలుపు తెరిచారు. ఇంకా సిబ్బంది మరో ట్రయల్ రూమ్ ఉపయోగించమని జర్నలిస్టును కోరారు. 
 
అయితే ఆ ట్రయల్ రూమ్‌లో కూర్చున్న దుకాణదారుడు ట్రయల్ రూమ్‌లోపల ఆమె మార్చిన బట్టల ప్రత్యక్ష ఫుటేజీని చూస్తున్నాడని తెలుసుకుని జర్నలిస్టు సిబ్బందిపై గట్టిగా అరిచారు. ఈ ఘటనపై జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఇంతలో షాపు కీపర్ తన కొడుకును పిలిపించి వీడియోను తొలగించాడు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, మహిళను ట్రయల్ రూమ్‌కు బదులుగా పొరపాటున స్టోర్ రూమ్‌కు పంపినట్లు తెలిసింది. అయితే, పోలీసు అధికారులు సీసీటీవి ఫుటేజీని సేకరించి తదుపరి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments