Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సులో మహిళ వాంతులు: తల బైటకి పెట్టగానే తెగి రోడ్డుపై పడింది

ఐవీఆర్
సోమవారం, 27 జనవరి 2025 (12:04 IST)
కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో భయానక సంఘటన జరిగింది. బస్సులో ఎక్కిన ఓ ప్రయాణికురాలుకి వాంతులు అవుతుండటంతో బస్సు కిటికీ అద్దం తీసి వాంతి చేసుకునేందుకు తల బైటకు పెట్టింది. అంతే... తల తెగి ఎగిరి రోడ్డుపై పడింది.
 
ఈ భయానక ఘటన వివరాలు ఇలా వున్నాయి. కర్నాటకలోని ఆలహళ్లి గ్రామ నివాసి 58 ఏళ్ల శివలింగమ్మ కర్నాటక ఆర్టీసి బస్సు ఎక్కింది. బస్సులో కుడివైపు సీట్లో కూర్చుని ప్రయాణిస్తుండగా ఆమెకి వాంతులు అయ్యాయి. దీనితో తలను బైటకు పెట్టి వాంతి చేసుకుంటోంది. ఇంతలో వాయువేగంతో దూసుకు వచ్చిన టిప్పర్ లారీ బస్సును రాసుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో శివలింగమ్మ తల, కుడి చేయి రెండూ తెగి ఎగిరి రోడ్డుపై పడ్డాయి. ఈ ఘటన చూసి బస్సులో ప్రయాణికులు భయంతో కేకలు వేసారు. ఐతే టిప్పర్ లారీ డ్రైవర్ తన వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గొడ్డలి, జూట్ రోప్ పట్టుకుని హైదరాబాద్‌లో యాక్షన్ సీన్స్ లో నాగచైతన్య షూటింగ్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments