Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ళ సహజీవనం.. పెళ్లి మాటెత్తగానే మహిళా టెక్కీని చంపేసిన యువకుడు

ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. తన మనసుకు నచ్చిన ఓ యువకుడితో మూడేళ్లుగా సహజీవనం చేస్తూ వచ్చింది. ఈ విషయం తమ ఇంట్లో తెలిసింది. దీంతో వారు మందలించారు. ఈ విషయాన్ని తన యువకుడి వద్ద చెప్పి... పెళ్లి చేసుకుందామనే

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (11:51 IST)
ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. తన మనసుకు నచ్చిన ఓ యువకుడితో మూడేళ్లుగా సహజీవనం చేస్తూ వచ్చింది. ఈ విషయం తమ ఇంట్లో తెలిసింది. దీంతో వారు మందలించారు. ఈ విషయాన్ని తన యువకుడి వద్ద చెప్పి... పెళ్లి చేసుకుందామనే ప్రతిపాదన తెచ్చింది. కానీ, ఆ ప్రియుడు మాత్రం పెళ్లి మాటెత్తకానే ఆగ్రహోద్రుక్తుడయ్యాడు. మహిళా టెక్కీని గొంతునులిమి హత్యచేశాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని థానె జిల్లాలో ఉన్న బద్లాపూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నాసిక్‌కు చెందిన పూనం పూన్యకర్ గజ్‌బియే అనే యువతి ముంబైలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తోంది. గత మూడేళ్లుగా బద్లాపూర్‌లో నివసిస్తూ వస్తోంది. ఈ క్రమంలో విజయ్ సంజయ ఝార్కడ్ (22) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరు కలిసి గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. 
 
అయితే, ఈ వ్యవహారం పూనం కుటుంబ సభ్యులకు తెలియడంతో, వారు దీనిని వ్యతిరేకించారు. ఈ విషయాన్ని ఝార్కడ్‌కు పూనం చెప్పింది. తమ అనుబంధం కొనసాగాలంటే పెళ్లి చేసుకోకతప్పదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో వారి మధ్య జరిగిన గొడవ ఘర్షణకు దారి తీసింది. 
 
ఆ ఆవేశంలో పూనం చున్నీని ఆమె గొంతుకు బిగించి చంపేశాడు. అనంతరం, అక్కడి నుంచి తన స్నేహితుడి ఇంటికి పారిపోయాడు. ఈ విషయం తన స్నేహితుడికి చెప్పడంతో, అతను పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు హత్యా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments