Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో దారుణం : పెళ్లి చేయాల్సి వస్తుందని సవతి చెల్లెల్ని హత్య చేసిన అన్న

ఢిల్లీలో దారుణం జరిగింది. మానవసంబంధాలు మంటగలసిపోయాయి. పెళ్లి చేయాల్సి వస్తుందని చెల్లెల్ని హత్య చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే... న్యూఢిల్లీలోని హస్నాపూర్‌లోని మధువిహార్‌లో న

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (12:24 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. మానవసంబంధాలు మంటగలసిపోయాయి. పెళ్లి చేయాల్సి వస్తుందని చెల్లెల్ని హత్య చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే... న్యూఢిల్లీలోని హస్నాపూర్‌లోని మధువిహార్‌లో నివాసముండే కుటుంబ పెద్ద 2008లో మృతిచెందారు. ఆయనకు ఇద్దరు భార్యలు. వారి ద్వారా ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆ బాలికకు ఇప్పుడు 19 ఏళ్లు. దీంతో ఆమెకు పెళ్లి చేయాల్సిన బాధ్యత సవతి సోదరుడైన తపాస్ బర్మన్‌పై పడింది. 
 
సవతి చెల్లెలి బాధ్యత తలకెత్తుకోవాల్సిన తపస్, ఆమెకు వివాహం చేయడం కంటే ఆమె ప్రాణాలు తీయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాడు. అంతే.. ఆమె గొంతుకు చున్నీ బిగించి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. దీంతో మధువిహార్‌లోని ఆ ఇంటి నుంచి దుర్వాసనరావడంతో అనుమానం వచ్చిన స్థానికులు లోపలికెళ్లి చూడగా, బాలిక మృతదేహం పడి ఉంది. 
 
దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు పంపారు. అనంతరం తపస్ బర్మన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, పెళ్లి చేయాల్సి వస్తుందని చెల్లెలిని హతమార్చినట్టు తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments