Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డలతో కలిసి రైలులో నుంచి దూకిన మహిళ... చిన్నగాయం కూడా...

అనేకమంది కుటుంబ కలహాల కారణంగా బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. ఇలా పాల్పడేవారు కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొందరు రైలు పట్టాలపై పడుకోవడం, ఇంకొందరు రైలు నుంచి దూకడం, మరికొందరు విషం, పురుగుల మందు తీసుక

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (09:41 IST)
అనేకమంది కుటుంబ కలహాల కారణంగా బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. ఇలా పాల్పడేవారు కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొందరు రైలు పట్టాలపై పడుకోవడం, ఇంకొందరు రైలు నుంచి దూకడం, మరికొందరు విషం, పురుగుల మందు తీసుకుని చనిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, ఈ భూమిపై నూకలు ఉంటే మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వారికి చిన్నపాటి గాయం కూడా కాదు. ఇలాంటి ఘటనే ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
 
మధ్యప్రదేశ్, భూర్హన్‌పూర్‌ జిల్లాకు చెందిన తబాస్సుమ్ అనే మహిళ కుటుంబ కలహాల కారణంగా తన బిడ్డతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో నేపానగర్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. కొద్దిసేపు స్టేషన్‌లో ఉండి... సరిగ్గా పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైల్వే స్టేషన్‌ను సమీపిస్తున్న వేళ, ఒక్కసారిగా పట్టాలపైకి దూకింది. చుట్టూ చూస్తున్న జనాలు అరుస్తుండగానే రైలు వారిపై నుంచి వెళ్లిపోయింది. అయితే, వారిద్దరీ చిన్నపాటి గాయం కూడా కాలేదు. 
 
తల్లీకూతుళ్లు ట్రాక్‌కు మధ్యగా వీరు పడటంతో, రైలు వారి మీదుగా వెళ్లిపోయింది. ఆమె బిడ్డను తన చేతులతోనే పట్టుకుని, షాక్‌కు గురికాగా, ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్తతో విడాకులు తీసుకున్న తాను, ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments