నాగపట్టణంలో ఘోరం.. గుడిలోకి లాక్కెళ్లి మహిళపై గ్యాంగ్ రేప్

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (20:12 IST)
నిర్భయ, దిశ లాంటి చట్టాలొచ్చినా.. మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే వున్నాయి. తాజాగా 40 ఏళ్ల మహిళను గుడిలోకి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి ఒడిగట్టారు మృగాళ్లు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని నాగపట్టణంలో చోటుచేసుకుంది.

గురువారం రాత్రి సోదరి ఇంటికి ఒంటరిగా వెళ్తున్న మహిళను కత్తితో బెదిరించి గుడిలోకి లాక్కెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె దగ్గరున్న నగదును దోచుకుని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని భయపెట్టి పారిపోయారు. ఈ ఘటనకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
గుడిలో స్పృహతప్పి పడిపోయి ఉన్న మహిళను స్థానికులు అస్పత్రికి తరలించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు నిందితులు మద్యం సేవించి ఉన్నట్లు బాధితురాలు చెప్పిందని వెల్లడించారు. ఆమె వితంతువు అని, భవన నిర్మాణ కార్మికురాలిగా పని చేస్తోందని తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో వున్న నిందితులను అరెస్ట్ చేసే దిశగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం