Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్లో ఢిల్లీ తరహా సంఘటన.. బస్సులో అత్యాచారం

Webdunia
శనివారం, 31 జనవరి 2015 (08:06 IST)
ఢిల్లీలో జరిగిన నిర్భయలాంటి సంఘటన రాజస్థాన్లో పునరావృత్తం అయ్యింది. కదులుతున్న బస్సులో ఓ మహిళలపై అత్యాచారం జరిగింది. బస్సు డ్రైవరు, కండక్టరు ఇద్దరూ మహిళలపై పశువుల్లా తెగబడ్డారు. పిలానీ ప్రాంతంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఝుంఝును జిల్లా, పిలానీ ప్రాంతంలో స్లీపర్ బస్సు హరియాణాలోని లోహారుకు బుధవారం రాత్రి బయలుదేరింది. బస్సులో ఎక్కిన 36 ఏళ్ళ యువతి ఎక్కింది. అయితే తాను ఒక్క దానినే ఉన్నానని మరెవ్వరూలేరా అని ప్రశ్నించింది. అయితే తరువాత స్టేజీలో ఎక్కుతారని భయపడాల్సిన పని లేదని కండక్టరు చెప్పాడు. ఆ తరువాత స్టేజీలో కూడా ఎవ్వరూ ఎక్కలేదు. తిరిగి ప్రశ్నిస్తే భయపడాల్సిన పనిలేదని మళ్ళీ చెప్పారు. 
 
తరువాత మొదట తనపై కండక్టర్ కాలియా(36) అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత డ్రైవర్ కూడా నాపై అత్యాచారం చేశాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో వదిలివెళ్లారు. అనంతరం ఏదో వాహనం వస్తుంటే ఆ వాహనంలో దరిదాపుల్లోని పోలీసు స్టేషన్ కు చేరుకుంది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments