Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోయంబత్తూరు : కొడుకుని కట్టేసి... మహిళా ప్రొఫెసర్‌ను కాల్చి... 7 సవర్ల నగలు దోపిడీ

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. కుమారుడిని ఇంట్లో కట్టేసి.. మహిళా ప్రొఫెసర్‌ను కాల్చి చంపి... బీరువాలో ఉన్న 7 సవర్ల బంగారు నగలను దోపిడీ దొంగలు దోచుకుని పారిపోయారు. శనివార

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (09:33 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. కుమారుడిని ఇంట్లో కట్టేసి.. మహిళా ప్రొఫెసర్‌ను కాల్చి చంపి... బీరువాలో ఉన్న 7 సవర్ల బంగారు నగలను దోపిడీ దొంగలు దోచుకుని పారిపోయారు. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కోయంబత్తూర్‌ జిల్లాకు చెందిన లత (38) అనే మహిళ తిరుప్పూర్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈమె భర్త ఓపీఎస్‌ కాలనీకి చెందిన శివలింగం భారతీయార్‌ యూనివర్శిటీలో టెక్నికల్‌ అధికారిగా పని చేస్తున్నారు. 
 
అయితే, మనస్ఫర్థల కారణంగా భార్యాభర్తలు వేర్వేరుగా నివశిస్తున్నారు. ఈ క్రమంలో లత తన కుమారుడితో కలసి ఉంటోంది. కళాశాలకు వెళ్లే సమయంలో లత కుమారుడిని అదే ప్రాంతంలో ఉన్న పుట్టింట్లో వదిలి వెళుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం మనుమడు, లత ఇంటికి రాకపోవడంతో అనుమానించిన ఆమె తండ్రి లత ఇంటికి వెళ్లాడు.
 
అతను వెళ్లి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోంచి పొగలు వస్తున్నాయి. దాంతో అతను చుట్టుపక్కల వారి సాయంతో లోనికి వెళ్లి చూశాడు. శరీరం కాలిన స్థితిలో పడి ఉన్న కూతురిని చూసి బోరున విలపించాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయ కమిషనర్‌ సుందర్‌ రాజన్ నేతృత్వంలోని పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని మరో గదిలో బంధించిన ఆమె కుమారుడిని విడిపించారు.
 
కాగా, ఇంటి ప్రాంగణంలో కారపు పొడి చల్లివుండడంతో పాటు ఆమె ధరించిన 7 సవర్ల నగలు చోరీకి గురయ్యాయి. లత ఒంటరిగా ఉండడాన్ని గమనించిన దుండగులు నగల కోసం ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments