Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తలేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచి రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు

భర్తలేని సమయంలో తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని శృంగారంలో పాల్గొన్న మహిళను, ప్రియుడిని గ్రామస్థులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని తాటిచెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. ఈ ఘటన ఉత్తర బిహార్‌లోని ముజఫర్ నగర

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2017 (14:27 IST)
భర్తలేని సమయంలో తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని శృంగారంలో పాల్గొన్న మహిళను, ప్రియుడిని గ్రామస్థులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని తాటిచెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. ఈ ఘటన ఉత్తర బిహార్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గోపినాథ్‌పుర్ గ్రామ పంచాయితీకి చెందిన 30 ఏళ్ల మహిళకు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో ఎనిమిదేళ్ళ క్రితం వివాహమైంది. అయితే, ఈమెకు పక్క జిల్లా సితామర్హికి చెందిన 27 ఏళ్ల యువకునితో వివాహేతర సంబంధం ఉంది. ఇది గత మూడేళ్లుగా కొనసాగుతోంది. భర్తలేని సమయంలో ఫోన్ చేసి ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని శృంగారంలో పాల్గొనేది. 
 
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆ మహిళపై ఓ కన్నేశారు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో భర్తలేని సమయంలో ప్రియుడితో ఏకాంతంగా వివాహిత ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు. ఆ తర్వాత వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని గోపినాథ్‌పుర్ గ్రామ పంచాయితీ ఆదేశాల మేరకు దాదాపు 20 గంటల వరకు బంధించారు. అనంతరం ఇద్దరినీ తాటిచెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. 
 
ఈ వైరల్ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు ఆ గ్రామానికి చేరుకుని బాధితులను కాపాడారు. ఈ ఘటనపై రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. వివాహిత ఇచ్చిన ఫిర్యాదుతో ఐదుగురు గ్రామస్తులపై, ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు మహిళతోపాటూ ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
అయితే, ఆ వివాహిత తన భర్తను వదిలేసి ప్రియుడితో కలిసి జీవించాలని భావిస్తున్నట్టు డీఎస్పీ కృష్ణమురళికి తెలిపింది. అలాగే, 8 ఏళ్ల కిందటే వివాహమైనా, గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నానని సదరు మహిళ అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. మహిళ ఫోన్ చేస్తే ఆమె ప్రియుడు గోపీనాథ్‌పుర్ నుంచి సితామర్హికి వచ్చి వెళ్లేవాడని ఆ మహిళ పోలీసులకు వివరించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments