Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం ఇస్తానని ఇంటర్వ్యూకి పిలిచి స్నేహితుడుతో కలిసి అత్యాచారం చేశాడు...

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (11:05 IST)
సోషల్ మీడియాలో ఓ యువతికి ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ వ్యక్తి ఓ ఆన్‌లైన్ ఎగుమతి కంపెనీలో మేనేజరుగా పని చేస్తున్నట్టు పరిచయం చేసుకున్నాడు. దీంతో ఆ కంపెనీలో తనకు ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని యువతి కోరింది. అందుకు ఆయన సరేనన్నాడు. ఇంటర్వ్యూ కోసం ఆఫీసుకు రమ్మని కబురుపెట్టగా, ఆ యువతి ఆ వ్యక్తి వద్దకు వచ్చింది. అంతే.. తన స్నేహితుడుతో కలిసి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని మితాపూర్‌కు చెందిన డిగ్రీ చదివిన యువతికి సోషల్ మీడియాలో ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌కు చెందిన ఎహతేషామ్‌ అనే వ్యక్తితో పరిచయమైంది. కొన్నాళ్లు ఇద్దరూ చాటింగ్ చేసుకుని మంచి స్నేహితులుగా ఉన్నారు. 
 
తాను ఒక ఆన్‌లైన్ ఎగుమతి సంస్ధకు మేనేజర్‌గా పరిచయం చేసుకున్నాడు. డిగ్రీ చదివిని యువతి తనకు ఉద్యోగం కావాలని చెప్పటంతో తన కంపెనీలోనే ఇస్తాను అని చెప్పి ఆమెకు ఉద్యోగం ఇచ్చాడు. ఇంటర్వ్యూ కోసం మొరాదాబాద్ రావాలని చెప్పాడు. ఆ యువతి డిసెంబర్ 19 శనివారం బస్సులో ఢిల్లీ నుంచి యూపీలోని మొరాదాబాద్ చేరుకుంది.
 
సోషల్ మీడియా స్నేహితుడు బస్టాండుకు వచ్చి ఆమెను రిసీవ్ చేసుకుని బుద్ విహార్‌లోని హోటల్ రూమ్‌కు తీసుకు వెళ్ళాడు. అక్కడ అప్పటికే ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఆ యువతి ప్రయాణ బడలిక తీర్చుకున్న తర్వాత ఆమెను ఇంటర్వ్యూ చేస్తామని చెప్పారు. ఆమె రెడీ అయిన తర్వాత తాగటానికి కూల్ డ్రింక్ ఇచ్చారు. 
 
అది తాగిన తర్వాత ఆ యువతి స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి ఎహతేషామ్‌ ఆ యువతిపై అత్యాచారం చేసి స్నేహితులిద్దరూ పారిపోయారు. స్పృహలోకి వచ్చిన యువతి తనపై అత్యాచారం జరిగినట్లు గుర్తించింది. హోటల్ సిబ్బందిని నిందితుల గురించి వారి గురించి విచారించగా వారి గురించి ఏమీ సమాచారం ఇవ్వలేక పోయారు.
 
దీంతో తాను మోసపోయానని గ్రహించిన యువతి.. నేరుగా వెళ్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు హోటల్‌కు వచ్చి సీసీటీవీ ఫుటేజి పరిశీలించగా నిందితులను ఉత్తరాఖండ్‌లోని కాశిపూర్‌కు చెందిన రాజా, ఎహతేషామ్‌గా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chay and Samantha Divorce: సమంత- చైతూల విడాకులకు కారణం ఏంటంటే?

వ్యాపారవేత్తను పెళ్లాడనున్న అల్లు అర్జున్ హీరోయిన్

ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ కేసు - పరారీలో మలయాళ సినీ నటి

Allu Arjun: ప్రభాస్ తోపాటు అగ్ర హీరోలతో దర్శకులు క్రేజీ ట్విస్ట్ లు

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments