Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డలను వదిలి.. ఇన్‌స్టాగ్రామ్ ప్రేమికుడితో జంప్

సెల్వి
మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (10:32 IST)
ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ కోసం కన్నబిడ్డలను అనాధలుగా వదిలి పారిపోయింది.. ఓ తల్లి. ఈ ఘటన తమిళనాడులోని సేలంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ వ్యామోహం టీనేజ్ పిల్లల నుంచి పెద్దల వరకు వుంది. ఇన్‌స్టాగ్రామ్ కారణంగా ఎందరో వేలు వేలు సంపాదించుకుంటున్నారు. అయితే కొందరు పెడదారిన పడుతున్నారు. ఇలాంటి ఘటనే సేలంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సేలంకు చెందిన 28 ఏళ్ల సుదర్శన.. గత పదేళ్ల క్రితం కార్తీక్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు వున్నారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన సుదర్శన.. అందులోనే ఎక్కువ సమయం గడిపేది. 
 
ఈ క్రమంలో మాధేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. సుదర్శనను ఇది సరికాదని భర్త పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆమె పట్టించుకోలేదు. ఇటీవల సుదర్శన పిల్లలను అనాధలుగా వదిలిపెట్టి ప్రేమికుడితో పారిపోయింది. 
 
ఈ ఘటనపై భర్త కార్తిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ప్రారంభించారు. ఈ దర్యాప్తులో సుదర్శన ఇన్ స్టాగ్రామ్ ప్రేమికుడితో జంప్ అయినట్లు తేలింది. పరారిలో వున్న వారిని పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి పై ప్రియమార సాంగ్ చిత్రీకరణ

Rashmika : గర్ల్ ఫ్రెండ్ రశ్మిక కోసం పాటలో గొంతుకలిపిన విజయ్ దేవరకొండ

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments