Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాచకురాలు ప్రసవం నొప్పులు.. పురుడు పోసిన కానిస్టేబుల్

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (15:32 IST)
Baby
తమిళనాడులో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. వేలూరు సౌత్‌ పోలీస్‌ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న యువరాణి శనివారం రాత్రి స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని ఓ వస్త్ర దుకాణం వద్ద 35 ఏళ్ల యాచకురాలు ప్రసవం నొప్పులతో ఇబ్బంది పడుతోంది. మహిళతో పాటు ఆమె ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. 
 
అత్యవసర పరిస్థితిని గుర్తించిన యువరాణి మరో పోలీస్ కానిస్టేబుల్‌తో కలిసి ఆమెకు ప్రసవం చేసింది. దీంతో ఆ యాచకురాలు ఆడ శిశువు జన్మించింది. అనంతరం 108 సిబ్బందికి సమాచారం అందజేసి ఆసుపత్రికి తల్లీ, బిడ్డను తరలించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
 
బిడ్డకు జన్మనిచ్చిన ఆమెను విచారించగా.. భర్త వదిలి వెళ్లి పోవడంతో దిక్కులేక భిక్షాటన చేస్తున్నట్లు చెప్పింది. మహిళా పోలీసులు ఆమెకు దుస్తులు, వస్తువులను అందజేశారు. 
 
నవజాత శిశువును పట్టుకుని ఉన్న పోలీసు ఫోటోను చాలా మంది ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఇప్పుడు ఈఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments