Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షంలో తడిసిన విద్యుతు స్తంభాన్ని తాకిన టీచర్.. కరెంట్ షాక్‌కు మృతి

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (08:19 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఓ విషాదకర ఘటన జరిగింది. వర్షంలో తడిసిన విద్యుత్ స్తంభాన్ని తాకిన ఓ మహిళా టీచర్ ప్రాణాలు కోల్పోయారు. కరెంట్ షాక్ కొట్టడంతో ఆమె మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన విహార్ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన సాక్షి అహుజా (34) స్థానికంగా ఓ స్కూల్‌లో టీచరుగా పని చేస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా. భర్త అంకిత్ అహుజా గురుగ్రామ్‌లోని జపాన్ కంపెనీలో ఇంజనీరుగా పని చేస్తున్నారు. 
 
ఆదివారం ఉదయం 5.30 గంటలకు సాక్షి చండీగఢ్ వెళ్లేందుకు ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్ మొదటి గేటు వద్దకు వచ్చారు. రోడ్డుపై నిలిచివున్న వర్షపు నీటిని దాటే క్రమంలో పట్టు కోల్పోయి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకున్నారు. ఆ స్తంభం నుంచి విద్యుత్ షాక్ కొట్టడంతో ఆమె అక్కడే కుప్పకూలిపోవడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. విద్యుత్ స్తంభం వద్ద ప్లాస్టిక్ గొడుగు లేని వైర్లు కనిపించాయని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments